ఉపాధి

                 
                                   మా  గ్రామం  స్వయం  ఉపాధి  ద్వారా  ఆర్దిక  స్వావలoబన  వైపు  అడుగులు  వేస్తోంది. కొంతమంది  నిరుద్యోగ యువకులు  ఆటోలు, ట్రక్కులు  వంటి  రవాణా వాహనములు  నడుపుకొనుట  ద్వారా స్వయం  ఉపాధి  పొందుతున్నారు . మా  గ్రామ  మహిళలు   జీడిపప్పు  పరిశ్రమ  ద్వారా  మిక్కిలి  ఉపాధి పొందుతున్నారు . తద్వారా  వచ్చిన  ఆదాయాన్ని  స్వయం  సహాయక  సంఘాల  ద్వారా  చిన్న  మొత్తాలలో పెట్టుబడులు  పెట్టి ఆర్ధికాభివృద్ధి  సాధిస్తున్నారు .

                              మా  గ్రామం లో  2  సూక్ష్మ  తరహా  పరిశ్రమలు  కలవు. ఈ  పరిశ్రమల  ద్వారా  అనేక మందికి  ఉపాధి  లభిస్తున్నది . బెల్లం  తయారీ, పశుపోషణ, వ్యవసాయం వంటి  వాటి  ద్వారా  కొంత  మంది  ఉపాధి  పొందుతున్నారు.

                           మరికొంత  మంది  యువకులు  ఉపాది  నిమిత్తం  సింగపూర్, కువైట్, సౌది, మస్కట్  వంటి  దేశాలకు  వలస  వెళ్ళినారు .

                       మా  గ్రామం  శ్రమైక  జీవన  సౌందర్యానికి  అద్దం  పడుతుంది.    

No comments:

Post a Comment