మా గ్రామం వర్తక , వాణిజ్యములకు పేరుగాన్చినది. మా గ్రామం యొక్క ప్రధాన ఆదాయవనరు వ్యాపారము . మా గ్రామం లో మినుములు, కందులు ,జీడిపప్పు మొదలైన అపరాలు శుద్ధిచేయు మిల్లులు కలవు . మరొక ఆదాయవనరు పశుపోషణ. పాలు, పెరుగు, నెయ్యి మరియు పశుగ్రాసం వంటి పశు సంబంధ వ్యాపారము జరుగును .చెరుకు, కొబ్బరి, మొక్కజొన్న మొదలగు వాణిజ్య పంటల వ్యాపారం జరుగుతుంది. బెల్లం తయారు చేయు పరిశ్రమలు కూడా కలవు .
ప్రతీరోజు మా ఊరి నుండి జీడిపప్పు , మినపప్పు , కందిపప్పు , ఇడ్లీ రవ్వ
సెనగపప్పు మొదలగు అపరాలు , కొబ్బరి , బెల్లం వంటివి రాష్ట్రం నలుమూలలకు ఎగుమతి అగును .
No comments:
Post a Comment