చరిత్ర


           పచ్చని  పైరులతో  సొగసైన  కొబ్బరి  చెట్లతో  అందమైన  సరోవరములతో  కళకళలాడే  మా సూరాపురం  గ్రామం  అన్నపూర్ణ గా  పేరుగాంచిన  పశ్చిమ గోదావరి జిల్లా లో సర్ ఆర్థర్ కాటన్ నడయాడిన  నిడదవోలు పట్టణానికి  5 కి.మీ ల దూరము  లో నిడదవోలు నుండి యర్నగూడెం రహదారి లో ఉన్నది ." రామభక్త   హనుమాన్"  ప్రత్యక్ష  రక్షణ లో గ్రామ  ఆడపడుచు  "పుట్టాలమ్మ" సాదర  స్వాగతం  పలుకగా  జానకి రాముడు తన ఆశీస్సులతో  గ్రామ  రక్షణ  చేస్తాడు .

                 నిడదవోలు మండలములోని  ఒక చిన్న  గ్రామము  అయిన  మా  సూరాపురం  జనాభా  సుమారు  1500.  మా  గ్రామం ఎంతో  చారిత్రక  ప్రాధాన్యత  కలిగినది . 

                పూర్వ కాలం  13 వ  శతాబ్దములో  కాకతీయ వీరనారి  రాణి  రుద్రమదేవి  భర్త  అయిన వీరభద్ర  చాణుక్య రాజు  పశ్చిమ గోదావరి జిల్లా లోని  మా  ప్రాంతమును  పరిపాలించెను. కాకతీయుల తరువాత పరిపాలనకు వచ్చిన  రెడ్డి  రాజుల  కాలము లో  మరింత  ప్రకృతి  శోభ ను  సంతరించుకున్నది . 

                 మా  గ్రామము  నిడదవోలు (పూర్వపు  నామము -నిర్వధ్యాయపురం) పట్టణానికి  5 కి.మీ  దూరములో, పశ్చిమ గోదావరి జిల్లా  ముఖ్య  పట్టణము  ఏలూరు (హేలాపురి) కి  71 కి.మీ  దూరము లో, ఆంధ్రప్రదేశ్ రాజధాని  హైదరాబాద్ (భాగ్యనగరం )కి  395 కి.మీ  ల  దూరము లోను  ఉన్నది .

                పాడిపంటలతో  ప్రకృతి  శోభ తో  కళకళ  లాడే మా  గ్రామ  ప్రధాన జీవన  వనరులు  వ్యవసాయం  పశుపోషణ

అంతే గాక  మా గ్రామం జీడిపప్పు  శుద్ధి  పరిశ్రమలకు  అపరాల  వ్యాపారమునకు పేరుగాంచినది .

              మా  గ్రామము లో  ప్రధాన పంటలు  వరి, చెరుకు, కొబ్బరి.    


1 comment: