మా గ్రామం అభివృద్ధి బాటలో అడుగులు వేస్తూ శరవేగంగా ముందుకు సాగుతుంది. గ్రామము లోని రహదారులను సిమెంట్ రహదారులు గా అభివృద్ధి చెందినవి. సమగ్రమైన మురుగునీటి పారుదల వ్యవస్థ , పారిశుద్ధ్య వ్యవస్థ కలవు. గ్రామం లోని అన్ని రహదారులలో వీధి దీపాలు రాత్రి సమయాలలో గ్రామాన్ని విద్యుత్ దీప వెలుగులతో మిరుమిట్లు గొలిపేలా చేస్తాయి.
రక్షిత మంచినీటి సరఫరా పధకం గ్రామ ప్రజలందరికి సురక్షితమైన మంచినీటిని అందజేస్తుంది . గ్రామం లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గ్రామ ప్రజలు అందరు తమ వంతు కృషి చేస్తున్నారు .
చెట్లు నాటడం భూగర్బ జలాలను పెంచడం కోసం వర్షపు నీటిని ఇంకుడు గుంటలలోనికి ప్రవహించేటట్లు చేయడం వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాల ద్వారా గ్రామం లో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడింది .
ఇటువంటి కార్యక్రమాలలో విజయం సాధించడం వలన మా గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా "నిర్మల్ గ్రామ పురస్కార్ " అవార్డ్ లభించినది . అంతేగాక మా గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామం " హోదాను కల్పించినది. మా గ్రామం లోని ప్రాధమిక పాటశాల గ్రామం లోని పిల్లలు అందరు విద్యను అభ్యసించడానికి అనువుగా పాటశాలలో అన్ని రకముల సదుపాయములు కల్పించబడినవి. దీనికి ప్రోత్సహకముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "సర్వశిక్ష అభయాన్ " కార్యక్రమము

ద్వారా మద్యాహ్న భోజన పథకం మరియు ఇతర భోదన సంబంధ కార్యక్రమాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది .
No comments:
Post a Comment