సమైక్యత

                                                       
                                                       భారత దేశపు  ప్రజా  జీవనము  యొక్క  మౌళిక  సూత్రము  అయిన " భిన్నత్వము లో  ఏకత్వము "  నకు  ప్రత్యక్ష  ఉదాహరణ  మా  గ్రామము. మా  గ్రామము లోని  వివిధ వర్గాల  ప్రజలు కులమతాలకు  అతీతముగా  శ్రమైక  జీవన  పోరాటమును  కొనసాగిస్తారు. అతిథి మర్యాదలకు అగ్ర తాంబూలం  ఇస్తూ  "అతిధి  దేవో  భవ "  అనే  వేదోక్తిని  సాకారం  చేసేట్లు గా  కలిసిమెలిసి  నివసిస్తారు.  

  మహిళా  సాధికారతను  సాకారం  చేయడానికి  మా గ్రామ  మహిళలు  సమైక్యం  గా  స్వయం  సహాయక సంఘాలుగా  ఏర్పడి  ఆర్ధిక  స్వావలంబన  దిశగా  అడుగులు  వేస్తున్నారు. మా  గ్రామo లో  రాజకీయ చైతన్యం కలిగి  ఉండడం వలన  గ్రామ  పంచాయతి  లోని  50%  ప్రజా  ప్రతినిధులు  మహిళలు  కావడం  గమనార్హం. 

  యువకులు  పెద్దల  యందు  గౌరవ  మర్యాదలతో  ప్రవర్తిస్తూ  క్రమశిక్షణ  తో  మెలుగుతూ  గ్రామం  లో జరిగే అన్ని  ఉత్సవాలు  జయప్రదం కావడానికి  తమ  తోడ్పాటును  అందిస్తారు .  అన్ని  మతాల  పండుగలను  

   కలిసిమెలిసి  ఆనందోత్సాహాల  మద్య  జరుపుకుంటారు . అంతేగాక  మా గ్రామ  రైతులు  రైతుమిత్ర  సంఘాలుగా  ఏర్పడి  ఆ  సంఘం లోని  ప్రతి  సభ్యుడి  యొక్క  సమస్యలను  అధిగమించడానికి  సమైక్యo గా  కృషి  చేస్తూ  "సామూహిక  జీవన  సౌందర్యము "  ను  ఆస్వాదిస్తున్నారు. "కలిసి ఉంటే  కలదు  సుఖం "  అనే  పెద్దల  మాటలను  ఆచరణలో  చూపుతారు. 

No comments:

Post a Comment